VIDEO: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి విజ్ఞప్తి
HYD: తెలంగాణను భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ అనుచిత మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమాజం అసహ్యించుకోకముందే, కిషన్ రెడ్డి చొరవ తీసుకుని స్పీకర్ ద్వారా ఆ వ్యాఖ్యలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.