సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

SKLM: సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఇటువంటి పథకాన్ని ఎన్నడు ఏ ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.