భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :MLA
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు,చెరువులు పొంగిపొర్లే అవకాశాలు ఉన్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల పరిధిలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.