'మందకృష్ణపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు'

BDK: బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఈరోజు మాదిగ హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు సాంబశివరావు మాదిగ పాల్గొని మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసిన మందకృష్ణ మాదిగపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.