కలెక్టరేట్‌లో నేడు ‘పీజీఆర్‌ఎస్’

CTR: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి విజ్ఞప్తులను తీసుకుంటారని తెలిపారు. డివిజన్, మండలస్థాయిల్లోనూ పీజీఆర్‌ఎస్ నిర్వహించాలని సూచించారు.