యూరియా కష్టాలు.. పోలీస్ స్టేషన్‌లో టోకెన్ల పంపిణీ

KMR: బీబీపేట్ మండల కేంద్రంలోని సొసైటీ వద్దకు కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే రావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. సొసైటీ సిబ్బంది యూరియా బస్తాలు ఎవరికి పంపిణీ చేయాలో అర్థంకాక చేతులెత్తెశారు. రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సొసైటీ సిబ్బంది రైతులను కట్టడి చేయలేక, పోలీస్ స్టేషన్‌లో టోకెన్లు పంపిణీ చేశారు.