ఆదర్శంగా నిలిచిన లింగంపేట.. 13 జీపీలు ఏకగ్రీవం
KMR: పంచాయతీ ఎన్నికల్లో లింగంపేట మండలం ఆదర్శంగా నిలిచింది. మండలంలోని 41 పంచాయతీల్లో 13 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలోని రాంపల్లి, రాంపల్లి తండా,మెంగారం,ముంబాజిపేట్ తండా, బానాపూర్ తండా,బానాపూర్, నల్లమడుగు పెద్ద తండా, లింగంపల్లి కుర్దు, ఎల్లారం, మాలోత్ తండా, మాలోత్ సంగ్యా నాయక్ తండా, అయ్యపల్లి తండా, సజ్జన్ పల్లి గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి.