శ్రీవారి లడ్డూ విక్రయల్లో సరికొత్త రికార్డు

AP: తిరుమలలో ఈ ఏడాది జూలై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజున 3.24 లక్షలు విక్రయించగా అది 35 శాతం వరకు పెరగడం విశేషమన్నారు. దీంతో ఆ ఒక్కరోజులోనే లడ్డూల విక్రయం ద్వారా రూ.2.43 కోట్లు సమకూరిందని వెల్లడించారు. గత ఏడాది జూలై నెలలో లడ్డూల ఉత్పత్తి1,04,57,550 ఉండగా.. ఈ ఏడాది జూలైలో 1,25,10,300కు పెరిగిందన్నారు.