కౌలాస్ ప్రాజెక్టు ద్వారా 1420 క్యూసెక్కుల నీటి విడుదల

KMR: జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 1420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదే మొత్తాన్ని అధికారులు ప్రాజెక్టు ఒక గేట్, కెనాల్ ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1.237 టీఎంసీలు, ప్రస్తుతం 1.164 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈఈ సుకుమార్ పేర్కొన్నారు.