VIDEO: టీచర్స్ క్రికెట్ టోర్నీలో బ్యాటింగ్ చేసిన ఎమ్మెల్యే
NLR: కావలి జడ్పీ హైస్కూల్‌లో ఏపీ టీచర్స్ క్రికెట్, త్రోబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయని, గురువులు క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులకు ఆదర్శమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.