బస్సు, కారు ఢీ.. తప్పిన ప్రమాదం

బస్సు, కారు ఢీ.. తప్పిన ప్రమాదం

SRCL: గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు గురువారం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రయాణికులు, స్థానికులు సురక్షితంగా బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.