తూంకుంటలో ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్‌పై అవగాహన

మేడ్చల్: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. సామాజికవేత్త విజయరామ్ ఇందులో చేతులు కలిపి, వాటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ పర్యావరణానికి ఎంతగానో మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరు వీటిపై చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.