'ఏచూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

'ఏచూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

SRPT: సీతారాం ఏచూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నూతనకల్ మండలం చిల్పకుంట్లలో ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. నీతి నిబద్ధత కలిగిన తొలి తరం కమ్యూనిస్టు నేత ఏచూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.