మంచిమాట: భయపడకుండా తొలి అడుగు వేయండి
నాకు ఫలానా పని చేయడానికి తగిన అర్హత లేదని, ఆ పనిని నాకంటే మరోకరు మెరుగ్గా చేశారనే మాటలు వదిలేసి ముందడుగు వేయాలి. ఆ పనిని ఇప్పుడు మొదలుపెట్టడానికి నాకు వయసు మించిపోయింది లాంటివన్నీ మీకు మీరు భయంతో చెప్పుకునే సాకులే తప్ప నిజాలు కాదు. అనిశ్చితికి భయపడకుండా మీరు తొలి అడుగు వేసిన తర్వాతే మీ సామర్థ్యం ఏంటని మీకు తెలుస్తుంది.