నిరసన వ్యక్తం చేసిన విశ్రాంత ఉద్యోగులు

BDK: విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న 5 DRలను ప్రకటించాలని, రెండు PRCలు ఇవ్వాలని, రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. టీచర్లకు ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరావ్ డిమాండ్ చేశారు.