సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
SDPT: తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సిసి రోడ్డు పనులకు రూ. 10 లక్షలు మంజూరయ్యానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళావతి స్వామి, ఆత్మ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ విజయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.