ఎప్పటికప్పుడు కేంద్రాన్ని సంప్రదిస్తున్నాం: మంత్రి

HYD: యూరియా సరఫరాపై ఎప్పటికప్పుడు కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఎండీతో ఈరోజు సమావేశం నిర్వహించారు. RFCL నుండి తెలంగాణకు రావల్సిన 62,473 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా సరఫరా కాలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైన యూరియాను త్వరలో సరఫరా చేస్తామని RFCL ఎండీ హామీ ఇచ్చారు.