'శాయంపేట నకిలీ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి'
హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు బుధవారం వినతిపత్రం సమర్పించారు. శాయంపేట శివారులోని సర్వే నెంబర్లను తప్పుడు విధంగా మార్చి నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. బాధిత పేద కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘీ ఎలేందర్, రోంటాల దేవా పాల్గొన్నారు.