'పేదలకు సొంతింటి కల నెరవేరడం పట్ల హర్షం'
SDPT: జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో నేడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు లబ్ధిదారుల నూతన గృహాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, పేదలకు సొంతింటి కల నెరవేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.