సైబర్ నేరగాడు అరెస్ట్
అన్నమయ్య: గతేడాది మదనపల్లెలో లాయర్‌ను డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసి రూ. 92 లక్షలు ఓ దుండగుడు కాజేశాడు. సైబర్ నేరగాడు బళ్లారికి చెందిన విరూపాక్షగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మదనపల్లె పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రజలు ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.