గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

NRML: భైంసా డివిజన్‌తో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకిగాను గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో ప్రాజెక్టుకు 1147 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వచ్చినట్లు గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు ఒక గేటును ఎత్తివేసి దిగువనకు 1147 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.