VIDEO: గాయపడిన కోతికి స్థానికుల మానవతా సహాయం

VIDEO: గాయపడిన కోతికి స్థానికుల మానవతా సహాయం

జనగాం పట్టణంలోని రవళి నర్సింగ్ హోమ్ పక్కన విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో గాయపడిన ఒక కోతికి ఇవాళ స్థానిక యువకులు రక్షించి మానవత్వం చాటారు. ముందుగా దానికి సీపీఆర్ చేసి, నీటిని తాగించి ప్రాణాన్ని రక్షించారు. అనంతరం ప్రాధమిక చికిత్స కోసం కోతిని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేశారు.