ఏలూరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ఏలూరు: ఏటిగట్టులోని యాదవ సంఘం భవన్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. యాదవ సంఘం సభ్యులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అందరికి సౌభాగ్యం, ఆనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలని కోరుకుంటూ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.