చెన్నకేశవ స్వామికి వేలంపాటలో అధిక ఆదాయం

చెన్నకేశవ స్వామికి వేలంపాటలో అధిక ఆదాయం

TPT: వల్లూరు మండలం పుష్పగిరిలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బుధవారం ఎండోమెంట్ అధికారులు నిర్వహించిన వేలంపాటలో, టెంకాయలు అమ్ముకునే హక్కును రాజరాజేశ్వరి రూ.4.91 లక్షలకు పొందారు. ఇది గతంలో కంటే రూ.1.41 లక్షలు అధిక ఆదాయం. తలనీలాలు ప్రోగు హక్కును మైదుకూరు జె.చిన్నశీను రూ.8.50 లక్షలకు సాధించారు, ఇది గతంలో కంటే రూ.2.50 లక్షలు అధిక ఆదాయం స్వామికి వచ్చింది.