గణేష్ శోభాయాత్రలో పోలీసుల తీన్మార్ డ్యాన్స్

HYD: నగరంలో గణపతి నిమర్జనాల జోరు కొనసాగుతోంది. ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, తెలుగు తల్లి వంతెన, నారాయణగూడ సహా అనేక చోట్ల శోభ యాత్రలు మిన్నంటాయి. నిమజ్జనం శోభాయాత్రలో పోలీసుల డాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. నిమజ్జన కార్యక్రమాల్లో ఒకవైపు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూనే, డాన్స్ చేసి పోలీసులు ఉత్తేజపరచగా, అందరూ చప్పట్లతో అభినందించారు.