VIDEO: ఎక్సైజ్ వాహనాల వేలంలో భారీ ఆదాయం
SRPT: జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం 24 సీజ్డ్ వాహనాలకు నిర్వహించిన వేలం పాటలో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఎక్సైజ్ అధికారి లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో, ఇన్స్‌పెక్టర్ స్టీవెన్ సన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగింది. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 4,06,980 ధర కంటే 82 శాతం అధికంగా, అంటే రూ. 7,39,860 ఆదాయం రావడం విశేషమని అధికారులు తెలిపారు.