పల్లవి గ్రూప్ ఉన్నతాధికారుల సందర్శన
WGL: పర్వతగిరి మండలం అన్నారం పల్లవి గ్రూప్ స్కూల్‌ను శనివారం ఫ్రాంచైజ్ హెడ్ నిధి పాండే ఆచార్య, అకడెమిక్ కోఆర్డినేటర్ కిషోర్‌లు సందర్శించి, స్కూల్‌లోని బోధనా విధానాలు, విద్యార్థుల అభ్యాస స్థాయి, క్రమశిక్షణను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభ, కో-కరిక్యులర్ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు.