VIDEO: జిల్లా యువతకు సీఎం GOOD NEWS
అనంతపురం జిల్లా యువతకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. రాప్తాడులో రూ. 497 కోట్లతో పరిశ్రమ రాబోతుందన్నారు. అలాగే, టేకులోడులో ఏరో స్పేస్ పరిశ్రమ వస్తుందన్నారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. మూడు ఏళ్ల లోపు పరిశ్రమలు పూర్తి అవుతాయని.. దీంతో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.