జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద

జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద

GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు అన్ని గేట్లను మూసివేశారు. సోమవారం ప్రాజెక్టుకు 78,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది, అయితే పవర్ హౌస్, స్పిల్ వే ద్వారా 44,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 8.976 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, మొత్తం అవుట్‌ఫ్లో 74,000 క్యూసెక్కులుగా ఉందన్నారు.