తిమ్మాపురంలో భక్తుల సందడి
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు భీం పాండే, అంకిత్ పాండే స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.