కాకినాడ రూరల్‌లో భారీ వర్షం

KKD: కాకినాడ రూరల్‌లో భారీ వర్షం కురిసింది. రమణయ్య పేట పూర్తిగా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సర్పవరంలో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం, ఈదురు గాలులతో కరెంటు సరఫరా నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత అధికంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా మేఘావృతమై వర్షంతో వాతావరణం చల్లపడింది.