గాంధీ క్షేత్రంలో జనవరి 10,11 తేదీలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ
కృష్ణా: అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జనవరి 10, 11 తేదీలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ ఆదివారం అవనిగడ్డలో మీడియాకు తెలిపారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలు, స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు.