రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు ప్రారంభం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని రాంనగర్ వద్దగల రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు కొనసాగించేందుకు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ సిబ్బందితో మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కాల్ టెక్స్, రైల్వే స్టేషన్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.