పెద్దమందడి ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం

పెద్దమందడి ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం

WNP: పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి, వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.