VIDEO: గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ.. 6 గొర్రెలు మృతి

VIDEO: గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ.. 6 గొర్రెలు మృతి

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామ శివారులో లారీ గొర్రెల మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. లారీ మహారాష్ట్ర నుంచి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం అతివేగం, నిద్రమత్తె అని స్థానికులు తెలియజేశారు.