అన్న క్యాంటీన్లో భోజనం చేసిన మున్సిపల్ కమిషనర్

అన్న క్యాంటీన్లో భోజనం చేసిన మున్సిపల్ కమిషనర్

CTR: పుంగనూరు పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. తాగునీరు, ఆహార పదార్థాల నాణ్యత గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన భోజనం చేసి రుచి చూశారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.