ఇప్పటి వరకు 41.6 మిల్లీమీటర్ల వర్షం
NLR: దిత్వా తుఫాన్ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో గత 5 రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు వర్షం కురుస్తుంటే మరో వైపు చలి తీవ్రత ఎక్కువ ఉంది. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 41.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మండల తాసిల్దార్ ఓ ప్రకటనలో తెలిపారు.