'పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి'

'పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి'

తూ.గో: అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి స్థల సేకరణకు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి లోకేష్‌కు ఉండవల్లిలో వినతిపత్రం అందజేశారు. అనపర్తిలో కళాశాల ఏర్పాటుకు ఐదు ఎకరాల స్థలం కావాలని, స్థల సేకరణతో పాటు కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు.