సాయిబాబా శత జయంతి.. ప్రపంచమంతా వేడుక
సత్యసాయి బాబా 100వ జయంతిని పురస్కరించుకుని పుట్టపర్తిలో నేడు అశేష భక్తజన సందోహం మధ్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశక్తి శివసాయి శంకరుడిగా భక్తులు ఆరాధించే బాబా బోధనలను, విద్య, వైద్య సేవా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది స్మరించుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.