VIDEO: కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
WGL: వర్ధన్నపేట పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద వివాదం చెలరేగింది. స్థానిక హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలీసులు, తమ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారని పేర్కొంటూ కలెక్టర్ సత్య శారదకు ఫిర్యాదు చేశారు.