కలుషితం కాకుండా చూడాలనిఆందోళన

W.G: కాళ్ల మండలం ఏలూరుపాడులో మంచినీటి చెరువు కలుషితం కాకుండా అధికారులు చూడాలని సీపీఎం మండల కార్యదర్శి జి.రామకృష్ణ అన్నారు. ఏలూరుపాడులో మంచినీటి చెరువు సమీపంలో తవ్వుతున్న ఆక్వా చెరువు పనులు నిలిపివేయాలని కోరుతూ శనివారం సీపీఎం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయితీ మంచినీటి చెరువు పక్కన తవ్వుతున్న ఆక్వా చెరువులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు