ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం: MLA బండారు శ్రావణి
ATP: డా.బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజలు కోరిన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని MLA బండారు శ్రావణి తెలిపారు. భారతదేశంలో మహిళలు రాజకీయంగా, ఉద్యోగపరంగా పురుషులతో సమానంగా స్థిరపడటానికి అంబేడ్కర్ కృషియే కారణమని ఆమె కొనియాడారు. దళితులు సగర్వంగా జీవనం కొనసాగించడానికి అంబేడ్కర్ చేసిన కృషిని ప్రతి మహిళ గుర్తుంచుకోవాలని శ్రావణి అన్నారు.