'ఉపాధి హామీ కూలీలకు 'ముఖ హాజరు' తప్పనిసరి'

'ఉపాధి హామీ కూలీలకు 'ముఖ హాజరు' తప్పనిసరి'

GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడులో ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్‌పై అవగాహన కల్పించారు. మార్చి 2 నుంచి తెలంగాణలో ముఖ హాజరు విధానం అమల్లోకి వచ్చిందని జిల్లా కోఆర్డినేటర్ ఎంజి. నరసింహులు తెలిపారు. పని ప్రారంభంలో ఒకసారి, ముగింపులో ఒకసారి ఫోటో తీయించుకుంటేనే హాజరు నమోదవుతుందని.. లేదంటే వేతనాలు జమకావని స్పష్టం చేశారు.