రిలే నిరాహార దీక్షలకు తరలి రండి: సీపీఎం
NDL: ఈ నెల 17న చేపట్టే రిలే నిరాహార దీక్ష రైతులు తరలి రావాలని సీపీఎం జిల్లా కార్య వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరావు పిలుపు నిచ్చారు. ఆదివారం మిడుతూరు మండలం, కాజీపేటలో నాయకులతో కలిసి సంబందిత కరపత్రాలు విడుదల చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆచరణలో కాలయాపన చేయడం రైతులను మోసం చేయడమే అని ఆరోపించారు.