VIDEO: వనపర్తి డిపోకు నాలుగు ఎలక్ట్రిక్ బస్సులు: డీఎం
WNP: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు తోడ్పడతాయని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. వనపర్తి డిపోలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సెమిలగ్జరీ బస్సులతో కలిపి మొత్తం 112 బస్సులు ఉన్నాయని అన్నారు. నాలుగు ఎలక్ట్రిక్ బస్సులు, 3 ఎక్స్‌ప్రెస్ బస్సులను డిపోకు కేటాయించినట్లు తెలిపారు.