అమరావతిపై సజ్జల కామెంట్స్.. వీడియో వైరల్
AP: YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వీడియో SMలో వైరల్ అవుతోంది. 'ఛత్తీస్‌గఢ్‌లో నయా రాయిపూర్ ఎప్పుడో 2001లో మొదలుపెట్టారు.. ఇంకా అవ్వలేదు. అలాంటిది అమరావతి 5 ఏళ్లల్లో పూర్తవ్వడం కష్టం' అని మాట్లాడారు. 'మాకు దొరికిన అభినవ శకుని మీరు. ఆనాడు కౌరవుల పక్షాన ఉండి, వారి ఓటమికి కృషి చేసినట్లు.. ఈయన కూడా అదే పాత్ర పోషిస్తున్నాడు' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.