విమానం కూలిన ఘటనలో 20 మంది మృతి!
టర్కీ సైనిక కార్గో విమానం కూలిన ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. విమానం గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చేలరేగడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. విమానం కుప్పకూలిన వెంటనే స్థానిక రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రాణనష్టం వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.