దుర్గి మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌గా లింగా బ్రహ్మయ్య

దుర్గి మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌గా లింగా బ్రహ్మయ్య

PLD: దుర్గి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా లింగా బ్రహ్మయ్యను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముటుకూరు గ్రామానికి చెందిన ఆయనతో పాటు 18 మందిని కమిటీ సభ్యులుగా నియమించింది. వైస్‌ ఛైర్మన్‌గా మునుగోటి సత్యనారాయణను ఎంపిక చేశారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.