విశాఖలో మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు

విశాఖలో మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు

VSP: డాక్టర్ అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ వెల్ఫేర్ డే వేడుకలు మంగళవారం జరిగాయి. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముస్లింలకు కొత్త స్మశానవాటికలు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.