హై లెవెల్ వంతెనలు లేక ఇబ్బందులు

హై లెవెల్ వంతెనలు లేక ఇబ్బందులు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపై ఉన్న లో లెవెల్ వంతెనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని రోటిగూడ, కవ్వాల్, కొత్తపేట్ గ్రామాలకు వెళ్లే రోడ్లపై చాలాచోట్ల లో లెవెల్ వంతెనలు ఉన్నాయి. భారీ వర్షాలు పడినప్పుడల్లా ఆ వంతెనలపై వరద నీరు ప్రవహించడంతో ప్రజలు, వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. హై లెవెల్ వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరారు.